Thursday, March 19, 2026
Homeసినిమాఆచార్య టీజ‌ర్ కి ముహుర్తం ఫిక్స్

ఆచార్య టీజ‌ర్ కి ముహుర్తం ఫిక్స్

Siddha’s Teaser:
మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ‘ఆచార్య‌’. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్నఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఆచార్య అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృత‌గా ఎదురు చూశారు.

ఆఖ‌రికి మెగా ఫ్యాన్స్ హ్యపీగా ఫీల‌య్యేలాగే అప్ డేట్ ఇచ్చారు. అవును.. ఆచార్య సినిమా నుంచి సిద్ద పాత్ర పోషిస్తున్న రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఈ టీజర్ ని నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలియ‌చేశారు. అంతే కాకుండా చిరు, చ‌ర‌ణ్ ఉన్న పోస్ట‌ర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేయ‌నున్నారు.

Also Read :  ఫిబ్రవరిలో వస్తున్న ‘ఆచార్య’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular