Friday, April 19, 2024
Homeసినిమాప్రభాస్ మూవీలో వర్మ.. ఇది నిజమా..?

ప్రభాస్ మూవీలో వర్మ.. ఇది నిజమా..?

ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, మారుతితో సినిమా చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డితో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇవి కాకుండా బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఆదిపురుష్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. గ్రాఫిక్స్ సరిగాలేవనే టాక్ రావడంతో క్వాలిటీ కోసం మరో 100 కోట్లు ఖర్చు అయినా ఫరవాలేదు బాగుండాలని మళ్లీ వర్క్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రాజెక్ట్ కే మూవీలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గెస్ట్ రోల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రాజెక్ట్ కే చిత్రంలో ఒక చిన్న పాత్ర కోసం మేకర్స్ ఇటీవల రామ్ గోపాల్ వర్మను సంప్రదించారట. స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపించడానికి వర్మ సైతం ఓకే చెప్పాడట. దర్శకుడు త్వరలో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకోనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. వివాదాలకు మరో పేరైన వర్మ గత కొంత కాలంగా సరైన సినిమా చేయడం లేదు. ఫలితం గురించి పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాడు.

తను డైరెక్ట్ చేసిన పవర్ స్టార్ అనే చిన్న చిత్రంలోనూ రామ్ గోపాల్ వర్మ కాసేపు కనిపించారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలోనే ఒక పాత్ర చేస్తున్నారని వార్తలు వస్తుండడంతో ప్రాజెక్ట్ కే పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ అండ్ సోషియో ఫాంటసీ మూవీ. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2024లో ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగా ఇందులో వర్మ నిజంగా నటిస్తున్నారా..?  లేక ఇది గ్యాసిప్పా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్