Thursday, September 19, 2024
Homeసినిమాహరీశ్ శంకర్ తో రామ్ కన్ఫర్మ్!

హరీశ్ శంకర్ తో రామ్ కన్ఫర్మ్!

హీరోగా రామ్ ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు కావొస్తుంది. ఈ 20 ఏళ్లలో 20 సినిమాల వరకూ చేశాడు. లవర్ బాయ్ గా యూత్ నుంచే కాకుండా, మాస్ ఆడియన్స్ నుంచి కూడా మార్కులు కొట్టేశాడు. అలాంటి  రామ్ నుంచి మరో మాస్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే ‘ డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ అభిమానులంతా ఇప్పుడు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా తరువాత రామ్ ఏ దర్శకుడితో చేయనున్నాడా అనే ఒక సందేహం కూడా అభిమానులలో ఉంది. ఈ నేపథ్యంలోనే హరీశ్ శంకర్ పేరు వినిపిస్తోంది. హరీశ్ శంకర్ తో రామ్ సినిమా ఉండొచ్చనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఆ విషయంలో క్లారిటీ కోసమే ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ క్లారిటీ హరీశ్ శంకర్ వైపు నుంచి వచ్చింది. రామ్ తో సినిమా చేయనున్నట్టు ఆయన స్వయంగా చెప్పాడు.

పవన్ తో సినిమా కోసమే చాలా రోజులుగా వెయిట్ చేస్తూ వచ్చిన హరీశ్, ఆ తరువాత రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ ను సెట్ చేసుకుని, ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. త్వరలో రామ్ తో సినిమా ఉంటుందనీ, ఈ సినిమాకి కృష్ణ కొమ్మలపాటి నిర్మతగా వ్యవహరిస్తాడని అన్నాడు. అందువలన ఇక ఈ విషయంలో డౌట్ పడవలసిన పనిలేదు. ‘డబుల్ ఇస్మార్ట్’ తో మరోసారి మాస్ లుక్ తో వస్తున్న రామ్ ను, హరీశ్ ఎలా చూపిస్తాడో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్