3.5 C
New York
Monday, December 11, 2023

Buy now

HomeసినిమాRama Banam: హిట్ అనేది ఇప్పుడు ఈ ఇద్దరికీ కీలకమే! 

Rama Banam: హిట్ అనేది ఇప్పుడు ఈ ఇద్దరికీ కీలకమే! 

గోపీచంద్ కెరియర్ లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ‘లక్ష్యం’ .. ‘లౌక్యం’ కనిపిస్తాయి. యాక్షన్ సినిమాలతో ఎక్కువ మార్కులు కొట్టేసిన గోపీచంద్ ను, ఫ్యామిలీ హీరోగా ఆడియన్స్ అంగీకరించడానికి కారణమైన సినిమాల్లో ఈ  రెండూ ముందువరుసలో కనిపిస్తాయి. ఇక దర్శకుడిగా శ్రీవాస్ కి కూడా ఈ రెండు సినిమాలు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. మాస్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలిసిన మరో డైరెక్టర్ వచ్చాడని అంతా అనుకున్నారు.

అయితే ‘లక్ష్యం’ .. లౌక్యం’ మధ్యలోను ..ఆ తరువాత కూడా గోపీచంద్ చేసిన సినిమాలు వాటి స్థాయిలో అభిమానుల ఆదరణ పొందలేకపోయాయి. గోపీచంద్ మార్క్ సినిమాలే అయినా, ఏ అంశాలు తక్కువ పడ్డాయోగానీ,  ఆ సినిమాలు ప్రేక్షకులను చాలా నిరాశపరిచాయి. ఇక శ్రీవాస్ పరిస్థితి కూడా అంతే. ఈ రెండు సినిమాల మధ్య ఆయన చేసినవి సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ  సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి ‘రామబాణం’తో వస్తున్నారు.

సక్సెస్ అనే మాటకి ఇద్దరూ చాలా దూరంగానే ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అందువలన ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తెలుగు తెరపై నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడుతున్న డింపుల్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమే. ఒక స్టార్ హీరో జోడీగా ప్రధానమైన కథనాయికగా ఆమె చేసిన సినిమా ఇది. అందువలన ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలనే ఆశాభావంతో ఆమె ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్