Wednesday, September 25, 2024
HomeసినిమాRama Banam Pre Release: సక్సెస్ కి సౌండ్ ఎక్కువ: కోన వెంకట్ 

Rama Banam Pre Release: సక్సెస్ కి సౌండ్ ఎక్కువ: కోన వెంకట్ 

గోపిచంద్ – శ్రీవాస్ కాంబినేషన్లో ఇంతకుముందు ‘లక్ష్యం’.. ‘లౌక్యం ‘ వంటి సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా భారీ విజాయాలను అందుకున్నాయి. ఆ రెండు సినిమాలు యాక్షన్ టచ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో వచ్చినవే. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు అదే జోనర్లో మరో సినిమాను చేశారు. ఆ సినిమా పేరే ‘రామబాణం’. ఈ నెల 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. డింపుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు కీలకమైన పాత్రను పోషించారు.

నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. దర్శక నిర్మాతలు .. ప్రధాన తారాగణంతో పాటు, ప్రత్యేక అతిథులుగా మారుతి .. సంపత్ నంది .. కార్తీక్ దండు .. కోన వెంకట్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ .. ” గోపీచంద్ నిజాయితీ గల వ్యక్తి అనీ, ఆయన నటనలోను ఆ నిజాయితీ కనిపిస్తూ ఉంటుందని అన్నారు. ఈ సినిమా నిర్మాతలతో తనకి గల అనుబంధం కారణంగానే తాను వచ్చానని చెప్పారు.

ఈవెంట్ కి తాను వచ్చిన దగ్గర నుంచి అభిమానుల్లో ఎనర్జీని గమనిస్తున్నాననీ, సక్సెస్ కి సౌండ్ ఎక్కువ గనుక, ఈ సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం కలిగిందని అన్నారు. ఈ సినిమాకి అందరూ కూడా చాలా అంకితభావంతో పనిచేశారనీ, వాళ్లంతా కలిసి వదిలిన రామబాణమే గోపీచంద్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాతో గోపీచంద్ – శ్రీవాస్ హ్యాట్రిక్ హిట్ అందుకోవడం ఖాయమని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్