Sunday, June 14, 2026
HomeసినిమాRama Banam Trailer: రాజమండ్రిలో...‘రామబాణం’

Rama Banam Trailer: రాజమండ్రిలో…‘రామబాణం’

‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల సక్సెస్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఐఫోన్, దరువెయ్యరా పాటలు చార్ట్ బస్టర్స్ గా అలరించాయి.

తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 20న రాజమండ్రిలో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో రామబాణం ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ట్రెండీ అవుట్ ఫిట్ లో స్టయిలీష్ గా కనిపించారు గోపిచంద్. భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రం భారీస్థాయిలో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular