Thursday, April 25, 2024
Homeసినిమాశివ‌రాత్రికి 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్

శివ‌రాత్రికి ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజర్

Teaser coming:  మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్ ఉంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా టీజర్ లాంచ్ తేదీని మేకర్స్ ఖరారు చేశారు.  మార్చి 1వ తేదీన మహా శివరాత్రి శుభ సందర్భంగా రామారావు ఆన్ డ్యూటీ టీజర్ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రవితేజ న్యూ యాక్షన్ పోస్టర్ విడుదల చేసింది.

ఈ పోస్టర్లో రవితేజ ఆకట్టుకునేలా సరికొత్త గెటప్లో కనిపించారు. ఈ పోస్టర్ భారీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా చక్కర్ లు కొడుతోంది. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శామ్ సిఎస్ అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్సి కెమెరా క్రాంక్ చేశారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్. ఇది యదార్థ సంఘటనల నుండి స్పూర్తి పొందిన కథ, సినిమా ప్రచార కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్