Thursday, March 12, 2026
Homeసినిమారామ్ చరణ్‌ - శంకర్ మూవీకి ముహుర్తం ఫిక్స్

రామ్ చరణ్‌ – శంకర్ మూవీకి ముహుర్తం ఫిక్స్

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్‌ రాజు, శిరీశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది రామ్ చరణ్‌ 15వ చిత్రం కాగా, దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం. శంకర్ తో సినిమా చేయాలనేది దిల్ రాజు డ్రీమ్. గతంలో దిల్ రాజు శంకర్ తో ఓ మూవీని ప్రకటించారు కానీ.. కొన్ని కారణాల వలన క్యాన్సిల్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే.. శంకర్ హైదరాబాద్ లోనే ఉండి లోకేషన్స్ సెర్చింగ్ లో బిజీగా ఉన్నారు.

సెప్టెంబర్ 8న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముహుర్తం పిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా కోసం హైదరాబాద్లోనే ఎక్కువ భాగం షూటింగ్ చేయనున్నారని తెలిసింది. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను జులై 2022కి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని నటిస్తుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్‌రాజు, శిరీశ్ ప్రెస్టీజియ‌స్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని. తెలుగు, త‌మిళ‌,, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular