Friday, April 19, 2024
HomeTrending Newsముస్లింలలో 6.96 శాతమే గ్రాడ్యుయేట్లు

ముస్లింలలో 6.96 శాతమే గ్రాడ్యుయేట్లు

ముస్లింలలో గ్రాడ్యుయేషన్‌, ఆపై చదువులు చదువుతున్న వారి సంఖ్య 6.96 శాతం మాత్రమేనని మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్‌ నక్వీ వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 43 శాతం ముస్లిం జనాభాలో కేవలం 2.75 శాతం మాత్రమే గ్రాడ్యుయేట్ల ఉన్న విషయం  వాస్తవమేనా అని రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి ఈ విషయం తెలిపారు.

వివిధ పథకాలు, కార్యక్రమాల కింద ముస్లింలలో అక్షరాస్యత సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఇలాంటి దయనీయ స్థితికి కారణాలేమిటన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ముస్లిం జనాభాలో అక్షరాస్యత 68.5 శాతం ఉన్నట్లుగా 2011 జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయన్నారు. హిందు జనాభాలో అక్షరాస్యత 73 శాతం, క్రైస్తవ జనాభాలో అక్షరాస్యత 84 శాతం, సిక్కులలో 75 శాతం, జైన్‌లలో 94 శాతం అక్షరాస్యత ఉన్నట్లు తెలిపారు.

ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైన్‌లు, బౌద్ద మతస్థులు, పార్సీలు వంటి ఆరు నోటిఫైడ్‌ మైనార్టీ మతస్థులు ఆర్థిక, సామాజిక, విద్యా రంగాలలో రాణించేందుకు తమ మంత్రిత్వ శాఖ అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. గడచిన ఏడేళ్ళ కాలంలో ఆయా మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్ధులకు 4.52 కోట్ల విలువ చేసే స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల ఫలితంగా మైనార్టీ విద్యార్ధుల్లో ముఖ్యంగా ముస్లిం విద్యార్ధినుల్లో డ్రాప్‌ అవుట్‌ రేట్‌ గణనీయంగా తగ్గినట్లు మంత్రి తెలిపారు.

హజ్‌ యాత్ర సబ్సిడీ రద్దు ఎందుకంటే…

విద్యాపరంగా మైనార్టీ మతస్థుల సాధికారికత కోసం వారి కోసం ప్రవేశపెట్టిన 3 స్కాలర్‌షిప్‌ పథకాలకు బడ్జెట్‌ కేటాయింపును 287 కోట్ల రూపాయలకు పెంచిన దృష్ట్యా 2018-19 నుంచి హజ్‌ యాత్రకు ఇచ్చే సబ్సిడీని పూర్తిగా రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు. హజ్‌ యాత్రకు సబ్సిడీ కింద 2017-18లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు 210 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు మంత్రి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్