వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి ఫస్ట్ టైమ్ కలసి చేసిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు‘. ఈ వెబ్ సిరీస్ గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ షూటింగ్ పూర్తవుతుందా..? ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూశారు. అయితే.. మార్చి 10న నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యింది. అయితే.. ఈ వెబ్ సిరీస్ చూసిన వాళ్లకి పెద్ద షాక్ అనిపించింది. మేటర్ ఏంటంటే.. వెబ్ సిరీస్ అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుందని తెలుసు కానీ.. ఇందులో అంతకు మించి ఉంది.
అయితే.. వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. ఇప్పటికీ వెంకీ సినిమా వస్తుంది అంటే లేడీస్ థియేటర్లకు వస్తుంటారు. ఈమధ్య కాలంలో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలకు మహిళలు సినిమా చూడడానికి వచ్చారంటే కారణం వెంకీనే. అలాంటి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వెంకీ ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ చేయడం అవసరమా..? తండ్రి పేరు వెంకీ, తాత పేరు రానా చెడగొట్టడం కోసమే ఈ వెబ్ సిరీస్ చేశారా.. అనేంతగా విమర్శలు వచ్చాయి. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంత దారుణంగా ఉందో.
ఈ వెబ్ సిరీస్ పై వస్తున్న విమర్శల పై రానా స్పందించాడు. ఈ సిరీస్ ను అసహ్యించుకుంటోన్న వారికి సారీ చెప్పారు. ట్విట్టర్ వేదికగా రానా అభిమానులకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. మరో వైపు ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్లోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తమ సిరీస్ కు ఇంతటి ఆదరణ అందించిన సినీ ప్రియులకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే ఈ సిరీస్ ను కుటుంబంతో కాకుండా ప్రతి ఒక్కరూ ఒంటరిగా చూడాలని మరోసారి చెప్పాడు. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ తెలుగు హిందీతో పాటు తమిళ్ మలయాళం స్పానిష్ భాషల్లో అందుబాటులో ఉంది.
Also Read :