Sunday, February 23, 2025
Homeసినిమాసైకో కిల్లర్ పాత్రలో రానా!

సైకో కిల్లర్ పాత్రలో రానా!

రానా .. ఒక వైపున పవర్ఫుల్ ప్రతినాయకుడిగా కనిపిస్తూనే, మరో వైపున కథానాయకుడిగాను చేస్తూ వెళుతున్నాడు. రానాకి కోలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకూ మంచి పరిచయాలు ఉన్నాయి. అందువలన ఇతర భాషలకి సంబంధించిన సినిమాలలోను ఆయన కనిపిస్తూ ఉంటాడు. అలా ఆయన నుంచి ఆ మధ్య వరుస సినిమాలు వచ్చాయి. ‘అరణ్య’ వంటి సినిమాలో కథానాయకుడిగా .. ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలో కథానాయకుడితో సమానమైన పాత్రను చేస్తూ వెళ్లాడు. ‘అరణ్య’కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ‘భీమ్లా నాయక్’ మాత్రం ఘనవిజయాన్ని సాధించింది. రానా నటనకి కూడా ప్రశంసలు దక్కాయి.

ఇక ఆ తరువాత రానా చేసిన ‘విరాటపర్వం’ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా తరువాత రానా తన దూకుడు తగ్గించాడనే చెప్పాలి. కారణం తెలియదు గానీ, కథానాయకుడిగా .. ప్రతి నాయకుడిగా కూడా ఆయన అంతగా ఉత్సాహం చూపించిన దాఖలాలు కనిపించలేదు. రానా తలచుకుంటే సొంత బ్యానర్లోనే వరుస ప్రాజెక్టులు పట్టాలెక్కించగలడు. కానీ ఎందుకో అలా జరగలేదు. ఆయన అభిమానులు మాత్రం ఆయన నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రానా మరోసారి విలన్ రోల్ చేయనున్నాడనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.  నాని తన సొంత బ్యానర్లో తానే హీరోగా ‘హిట్ 3’ నిర్మించనున్న సంగతి తెలిసిందే. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ‘సైకో కిల్లర్’ పాత్రలో రానా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ తరహా పాత్ర చేయడం రానాకి ఇదే ఫస్టు టైమ్. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. అయితే ఈ లోగానే రజనీకాంత్ ‘వెట్టైయాన్’ సినిమాతో, రానా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్