రానా, నాగచైతన్య వీరిద్దరి మధ్య ఉన్న బంధుత్వం గురించి తెలిసిందే. అయితే.. అంతకు మించి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు.. పెరిగారు. ఒకే చోట యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. అయితే.. వీరిద్దరూ కలిసి నటించలేదు కానీ.. ఎవరికి వాళ్లు సినిమాలు చేస్తూ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. వీరిద్దరికీ ప్రొడక్షన్ హౌస్ ఉన్నాయి. రానాకు సురేష్ ప్రొడక్షన్ ఉంటే.. నాగచైతన్యకు అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. అయితే.. రానా, చైతూ కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారని సమాచారం.

గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి నిర్మాణ సంస్థ పెట్టనున్నారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ప్రొడక్షన్ హౌస్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం.. ఎవరికీ తెలియకుండా ఓ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కూడా జరిగిందట. అయితే.. ఈ ఇద్దరు కలిసింది సినిమా కోసం కాదట. వెబ్ సిరీస్ కోసమని సమాచారం. తాజాగా ఓ కొత్త బేనర్ స్టార్ట్ చేసి ‘మాయాబజార్’ అనే వెబ్ సిరీస్ నిర్మించారట. ప్రస్తుతం షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. వీరిద్దరూ కలిసి ఏ ఓటీటీకి చేస్తున్నారు అనే డీటైల్స్ బయటికి రాలేదు కానీ తాజాగా ఓ సంస్థతో ఒప్పందం కూడా అయిపోయిందని సమాచారం.

అయితే ఈ సిరీస్ లో రానా, చైతూ కనిపించరు, వీరిద్దరూ కేవలం కంటెంట్ కి ప్రొడ్యూసర్స్ మాత్రమే. రానా ఇప్పటికే వెబ్ సిరీస్ లతో ఓటీటీ లోకి దిగాడు. చైతు కూడా ‘దూత’ అనే సిరీస్ చేశాడు. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రానా ఇప్పటికే రెండు మూడు సినిమాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరించాడు. చైతు నిర్మాతగా ఇదే మొదటి ప్రాజెక్ట్. రానా, చైతూ కలిసి వెబ్ సిరీస్ నిర్మించారంటే.. ఈ సిరీస్ కు మరింత క్రేజ్ రావడం ఖాయం. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. మరి.. నిర్మాతలుగా రానా, చైతూ సక్సెస్ సాధిస్తారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *