Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Husband: సంజయ్ రావు హీరోగా మైక్ మూవీస్ నిర్మిస్తున్న కామికల్ ఎంటర్ టైనర్ సినిమా “స్లమ్ డాగ్ హజ్బెండ్”. ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను స్టార్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు. మోషన్ పోస్టర్ హ్యూమరస్ గా ఉందన్న రానా… చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. “స్లమ్ డాగ్ హజ్బెండ్” మోషన్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే… వివాహాల్లో మనం పాటిస్తున్న కొన్ని మూఢ నమ్మకాలను వినోదాత్మకంగా చూపిస్తూ దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఐశ్వర్యరాయ్ కి చెట్టుతో పెళ్లి చేయడం, కొందరు వరులకు జంతువులతో వివాహాలు జరిపిన న్యూస్ క్లిప్పింగ్స్, రాశుల ఫొటోలు మోషన్ పోస్టర్ లో కనిపించాయి. ఈ చిత్రంలో హీరోకు కూడా ఇలాగే మూఢ నమ్మకాలతో ఓ కుక్కతో పెళ్లి జరిపిస్తారు. ఆ కుక్క పై హోలీ రోజు రంగు చల్లితే అర్జున్ రెడ్డి స్టైల్లో కోపంగా ఎవడ్రా నా కుక్కమీద రంగు పోసింది..అనడం నవ్వించింది. మిమ్మల్ని ఈ పెళ్లికి సంతోషంగా ఆహ్వానిస్తున్నాం అంటూ మోషన్ పోస్టర్ పూర్తయింది. పార్శీగుట్టలో లచ్చిగాని పెళ్లిసందడి మాములుగా ఉండదు అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న పాట సినిమా ఎంత మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందో తెలియజేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com