Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్Ranji Trophy: బెంగాల్ జోరు- నెమ్మదిగా కర్నాటక

Ranji Trophy: బెంగాల్ జోరు- నెమ్మదిగా కర్నాటక

రంజీ ట్రోఫీ-2023 సెమీ ఫైనల్స్ నేడు మొదలయ్యాయి. ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో బెంగాల్- మధ్య ప్రదేశ్ మధ్య జరుగుతోన్న మొదటి సెమీఫైనల్లో బెంగాల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 51  పరుగుల వద్ద బెంగాల్ రెండు వికెట్లు కోల్పోయింది. అభిమన్యు ఈశ్వరన్-27; కరణ్ లాల్-23 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సుదీప్ కుమార్ ఘరానీ – అనుష్టుప్ మజుందార్ లు మూడో వికెట్ కు 241 పరుగులు జోడించారు. అనుష్టుప్ 120(13 ఫోర్లు, 1 సిక్సర్); సుదీప్ కుమార్ -112 (12ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి ఔటయ్యారు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ 4 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది.

కెప్టెన్ మనోజ్ తివారీ-5; షాబాజ్ అహ్మద్ -6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మధ్య ప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ రెండు;  ఆవేష్ ఖాన్, గౌరవ్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో కర్నాటక-సౌరాష్ట్ర మధ్య జరుగుతోన్న రెండో సెమీస్ లో సౌరాష్ట్ర టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగుళూరు 21 పరుగులకే రెండు వికెట్లు (రవికుమార్ సమర్ద్-3; దేవదత్ పడిక్కల్-9) కోల్పోయింది. ఆ తర్వాత నికిన్ జోస్-18; మనీష్ పాండే- 7; శ్రేయాస్ గోపాల్ -15  కూడా త్వరగా ఔటయ్యారు. కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ –శ్రీనివాస్ శరత్ లు ఆరో వికెట్ కు అజేయంగా 117 పరుగులు జోడించారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 229 పరుగులు చేసింది.

మయాక్ 11 ఫోర్లు, 1 సిక్సర్ తో 110; శరత్ 4 ఫోర్లతో 58 పరుగులతో క్రీజులో ఉన్నారు.

సౌరాష్ట్ర బౌలర్లలో కుశాంగ్ పటేల్ రెండు; చేతన్ సకారియా, ప్రేరక్ మండక్ చెరో వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్