తనకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పదికోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని, అయితే దాన్ని తిరస్కరించానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన ఆరోపణ చేశారు. అంతర్వేదిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిగ్గు, శరం వదిలేసి ఉంటే తనకు పదికోట్ల రూపాయలు దక్కేవని వ్యాఖ్యానించారు.  ఉండి ఎమ్మెల్యే రామరాజు సంప్రదించారని, తెలుగుదేశం పార్టీలో తనకు మంచి పొజీషన్ ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చారని తెలిపారు. క్రాస్ ఓటింగ్ చేయాలని మొదటి బేరం తనకే వచ్చిందన్నారు. ఈ విషయం పార్టీ వైసీపీ హైకమాండ్ కు చెప్పలేదన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయతీ ముఖ్యమని, ఒకసారి పరువుపొతే సమాజంలో ఉండలేమని, అందుకే ఈ ఆఫర్ తాను నిర్ద్వద్వంగా తిరస్కరించామన్నారు. తన మిత్రుడు కెఎస్ఎన్ రాజు ద్వారా ఈ ఆఫర్ చేశారని తెలిపారు.

ఎమ్మెల్యేలను కొలుగోలు చేయడం టిడిపికి మొదటినుంచీ అలవాటేనని, గతంలో కూడా తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డి కొనుగోలు చేయబోయి దొరికిపోయారని, ఆ తర్వాత వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కోగులుగోలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్ళీ నలుగురు ఎమ్మెల్యేలను కోలుగోలు చేశారన్నారు.

Also Read : Ap Mlc Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యం ఫలితం; టిడిపి గెలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *