Friday, March 20, 2026
HomeTrending Newsఅంగన్వాడీలకు అరుదైన గౌరవం

అంగన్వాడీలకు అరుదైన గౌరవం

Anganwadis : అంగన్వాడి టీచర్లు, ఆయాలను సముచితంగా గౌరవించేందుకు ఇప్పటికే మూడు సార్లు వేతనం పెంచి, 30 శాతం పి.ఆర్.సి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నేతన్నలను ప్రోత్సహించడంలో భాగంగా అంగన్వాడీలకు చేనేత వస్త్రాలు అందించింది. నేడు హైదరాబాద్ లోని కేటీఆర్ గారి క్యాంప్ కార్యాలయంలో మంత్రులు కేటిఆర్ , శ్రీమతి సత్యవతి రాథోడ్ , మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య దేవ రాజన్ కలిసి ఈ చేనేత చీరలను అంగన్వాడిలకు అందించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన చేనేత – జుట్ బ్యాగులను విడుదల చేశారు.

రాష్ట్రంలోని 31,711మెయిన్ అంగన్వాడి కేంద్రాలు, 3989 మిని అంగన్వాడి కేంద్రాలలోని 67,411 మంది అంగన్వాడి టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లకు ఈ చేనేత చీరలు అందనున్నాయని మంత్రులు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి ఇప్పటికే రెండు జతల ప్రత్యేక చీరలు అందించడం జరిగిందన్నారు. ఇప్పుడు తాజాగా మూడో జతగా చేనేత చీరలు అందించడం సంతోషంగా ఉందన్నారు. అంగన్వాడీ లకు గౌరవ ప్రదమైన వస్త్రాలు..సరైన వేతనాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడి కేంద్రాలను పటిష్టం చేస్తున్నాం అని, ప్రి ప్రైమరీ విద్యను, పోషకాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీలకు అభినందనలు, ట్రాన్స్ జెండర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : మోడీది సేల్స్ మెన్ పాలన – కేటిఅర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular