Sunday, January 19, 2025
Homeసినిమా'ఫర్జీ' హిట్ తో మరింత బిజీ కానున్న రాశి ఖన్నా!

‘ఫర్జీ’ హిట్ తో మరింత బిజీ కానున్న రాశి ఖన్నా!

రాశి ఖన్నా గ్లామర్ కి వంక బెట్టవలసిన అవసరం లేదు. ఆమె హైటూ .. చక్కని మేనిఛాయ .. ఆకర్షణీయమైన రూపం ఎంతోమంది అభిమానులుగా మారడానికి కారణమయ్యాయి. కెరియర్  ఆరంభంలో  నటన విషయంలో ఈ బ్యూటీకి పడిన మార్కులు తక్కువే. ఇక స్కిన్ షోకి కూడా ఆమె హద్దులు దాటుతూ వెళ్లిన సందర్భాలు కనిపించవు. ఒక రకంగా రాశి ఖన్నా ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి అవి కారణాలుగా కనిపిస్తాయి.

అయితే ఆ తరువాత రాశి ఖన్నా తనని తాను మార్చుకుంటూ .. తీర్చుకుంటూ వెళ్లింది. నటన విషయంలో  ఆమె ఒక్కో మెట్టూ ఎక్కుతూ వెళ్లింది. కామెడీ టచ్ ఉన్న పాత్రలను సైతం చాలా తేలికగా చేయగలిగే స్థాయికి చేరుకుంది. ఇక స్కిన్ షో ను ఒక స్థాయి వరకూ చేయడానికి ఆమె వెనుకాడటం లేదు. ఆమెను ఆ రూట్ దిశగా తీసుకెళ్లినవి వెబ్ సిరీస్ లనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఆమె చేసిన సినిమాలేవీ సక్సెస్ టాక్ ను తెచ్చుకోలేదు.

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లను ఆమె ఒప్పుకుంటూ ముందుకు వెళుతోంది. రాశి ఖన్నా నుంచి ఇటీవల ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ వచ్చింది. షాహిద్ కపూర్ .. విజయ్ సేతుపతితో కలిసి ఈ వెబ్ సిరీస్ లో ఆమె విజృంభించింది. ఫేక్ కరెన్సీని ఈజీగా కనిపెట్టే ఒక ఆఫీసర్ గా ఆమె తన పాత్రలో మెప్పించింది. ఈ వెబ్ సిరీస్ గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. రాశి ఖన్నాకి మంచి  మార్కులు ఇచ్చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్ లలో రాశి ఖన్నా మరింత బిజీ కావడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్