Saturday, July 27, 2024
HomeTrending Newsఅమెరికా టార్గెట్ గా ఇరాన్ మిస్సైల్

అమెరికా టార్గెట్ గా ఇరాన్ మిస్సైల్

ఇరాన్ కొత్త త‌ర‌హా క్రూయిజ్ మిస్సైల్‌ అభివృద్ధి చేసింది. సుమారు 1650 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పావే మిస్సైల్‌ చేధించ‌గ‌ల‌దు. ఈ విష‌యాన్ని ఆ దేశ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ క‌మాండ‌ర్ తెలిపారు. త‌మ టాప్ క‌మాండ‌ర్‌ను చంపిన అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను హ‌త‌మార్చేందుకు ఈ క్షిప‌ణిని వాడ‌నున్న‌ట్లు రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ వైమానిక ద‌ళ చీఫ్ అమిరాలి హ‌జిజాదే తెలిపారు. 1650 కిలోమీట‌ర్ల దూరం వెళ్లే క్రూయిజ్ మిస్సైల్‌ను ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఆఫ్ ఇరాన్‌ అమ్ముల‌పొదిలో చేర్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

తాజాగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో.. ఇరాన్ త‌యారు చేసిన మిస్సైళ్ల‌నే ర‌ష్యా వాడుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌శ్చిమ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే పేద సైనికుల‌ను చంపేందుకు తాము క్షిప‌ణుల‌ను త‌యారు చేయ‌లేద‌ని, త‌మ క‌మాండ‌ర్ ఖాసిమ్ సులేమాని హ‌తమార్చిన వారిని చంపేందుకు ప్ర‌తీకారంతో ఉన్న‌ట్లు హ‌జిజాదే తెలిపారు. ట్రంప్‌, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి పాంపియో, సులేమాని హ‌త్య‌కు ఆదేశాలు ఇచ్చిన మిలిట‌రీ క‌మాండ‌ర్ల‌ను హ‌త‌మార్చ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్