Monday, June 15, 2026
Homeసినిమారష్మిక ...ఈ ఫ్లాప్ భారం మోయాల్సిందేనా? 

రష్మిక …ఈ ఫ్లాప్ భారం మోయాల్సిందేనా? 

Red Signal: తెలుగులో స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ ప్లేస్ కి రష్మిక చాలా దగ్గరలో ఉంది. ఒక వైపున కన్నడ .. మరో వైపున తెలుగు .. ఇంకో వైపున హిందీ సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. పనిలో పనిగా కోలీవుడ్ కి కూడా తన సత్తా చూపించాలనే ఉద్దేశంతో ఉంది. ఆ దిశగా కూడా ఈ అమ్మడు ఫాస్టుగానే పావులు కదుపుతోంది. ఈ మధ్యనే ‘పుష్ప’ సినిమాతో ఈ సుందరి పాన్ ఇండియా హిట్ కొట్టేసింది. ఈ సినిమా హిందీలో 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడంతో, ఇక ఆ వైపు నుంచి అవకాశాలు పుష్కలంగా వస్తాయనే భావిస్తోంది.

‘పుష్ప’ సినిమా సక్సెస్ ను అమ్మడు ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తుండగానే, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు‘ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమా పై ముందునుంచే బజ్  లేదు. పైగా సీనియర్ హీరోయిన్లు అయిన రాధిక ..  ఊర్వశి .. ఖుష్బూలతో కీలకమైన పాత్రలను చేయించారు. దాంతో ఈ సినిమాకి తమిళ ఫ్లేవర్ వచ్చేసింది. ఈ మూడు పాత్రలకు తెలుగు నుంచే ఆర్టిస్టులను తీసుకుని ఉంటే కొంతలో కొంత  ఉపశనం దొరికేదేమో.

ఇక ఇప్పుడు రష్మిక బాధ అంతా ఇంతా కాదు. తెలుగులో ఆమె చేతిలో ‘పుష్ప 2‘ తప్ప మరో సినిమా లేదు. హిందీలో తను చేసిన సినిమాలు జూన్ వరకూ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. కోలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా లేదు. ‘పుష్ప 2’ రెగ్యులర్ షూటింగు ఇంకా మొదలుకాలేదు. మొదలైన తరువాత ఎంతకాలానికి థియేటర్ల కు వస్తుందో తెలియదు. అప్పటివరకూ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఫ్లాప్ ను ఆమె మోయవలసిందే. పాపం .. రష్మికకి పెద్ద కష్టమే వచ్చిపడినట్టే!

Also Read :  పుష్ప 2 ప్లాన్ మారిందా?  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular