Friday, March 20, 2026
Homeసినిమాశేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న

శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న

స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంటున్న రష్మిక మందన్న మిగతా హీరోయిన్స్ నుంచి పోటీ ఎంత ఉన్నా కూడా తనదైన శైలిలో అవకాశాలు అయితే అందుకంటోంది. ప్రతి ఏడాది మినిమం సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో బిజీ గా మారుతుంది. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆమె రేంజ్ చాలా పెరిగిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది.

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ నటి రష్మిక మందన్న జోరు నడుస్తోంది. వరుసగా భారీ సినిమాలతో ఆమె క్షణం తీరిక లేకుండా ఉంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో భారీ ఆఫర్ చేరింది. శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్ లో ‘#D51’ సినిమా రానుంది. ధనుష్ కు ఇది 51వ సినిమా.ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్న ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. రష్మికకు స్వాగతం చెబుతూ ఓ పోస్టర్‌‌ ను విడుదల చేసింది. ఈ క్రేజీ ఆఫర్‌‌ తో రష్మిక చాలా సంతోషంగా ఉంది. సదరు పోస్టర్‌‌ ను ఫ్రేమ్ చేయించి ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular