Monday, June 15, 2026
HomeసినిమాPushpa 2: 'పుష్ప 2' పిక్ షేర్ చేసిన రష్మిక

Pushpa 2: ‘పుష్ప 2’ పిక్ షేర్ చేసిన రష్మిక

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. ఈ చిత్రానికి సుకుమార్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డ్ దక్కించుకోవడంతో పుష్ప సీక్వెల్ పుష్ప 2 పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ మరింత క్రేజ్ పెరిగింది. ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ మూవీ సెట్స్ నుండి రష్మిక ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ఈ మూవీకి సంబంధించిన సెట్ పిక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తారని ఈమధ్య వార్తలు వచ్చాయి. ఆతర్వాత పుష్ప 2 రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఇప్పుడు కాదు.. షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రకటించనున్నారని తెలిసింది. పుష్ప సినిమాలో వలే.. పుష్ప 2లో కూడా అదిరిపోయేలా సాంగ్స్ రెడీ చేశాడట దేవిశ్రీప్రసాద్. సుకుమార్ మాత్రం ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా సూపర్ అనేలా పుష్ప 2 ను తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular