Thursday, March 28, 2024
Homeసినిమారష్మిక చేతుల మీదుగా ‘చిత్తం మహారాణి’ పాట విడుద‌ల‌

రష్మిక చేతుల మీదుగా ‘చిత్తం మహారాణి’ పాట విడుద‌ల‌

Chittam Maharani: లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలో యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ.కాశీ తెరకెక్కిస్తున్న సినిమా ‘చిత్తం మహారాణి’. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కోలకళ్ళ చిన్నది’ లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల ఆలపించారు.

ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ విడుద‌ల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఓ విభిన్న క‌థాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

Also Read : రాజశేఖర్ ‘శేఖర్’ ఫస్ట్ సింగిల్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్