రాష్ట్రపతి భవన్కు పర్యటకులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. కరోనా ప్రభావంతో.. గతేడాది నిబంధనలు ఉన్నా ఈ ఏడాది రాష్ట్రపతి భవన్ సందర్శనకు నిబంధనలు సడలించారు. డిసెంబర్ ఒకటో తేది నుంచి రాష్ట్రపతి భవన్ సందర్శించవచ్చని…వారంలో అయిదు రోజులు అవకాశం ఉంటుందని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం నుంచి ఆదివారం వరకు సందర్శనకు అవకాశం ఇస్తారు. సెలవు రోజుల్లో అనుమతించారు. ప్రతి రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సందర్శించటానికి అనుమతి ఉంటుంది.
రాష్ట్రపతి భవన్ తో పాటు రాష్ట్రపతి భవన్ మ్యూజియం కాంప్లెక్స్ సందర్శించేందుకు వారంలో ఆరు రోజులు అవకాశం ఉంటుంది. మంగళవారం నుంచి ఆదివారం వరకు అనుమతిస్తారు.