Friday, March 20, 2026
Homeసినిమా'రావణాసుర' భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి

‘రావణాసుర’ భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి

Action Schedule: మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రావణాసుర` చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ షెడ్యుల్ లో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాలో ఇది కీలకమైన షెడ్యూల్. దీంతో చిత్రీకరణకు సంబంధించి మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది.

అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్ల పై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రవితేజ లాయర్ గా కనిపించబోతున్న ఈ చిత్రంలో సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన వీరిద్దరి ఫస్ట్ లుక్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లకు ప్రాధాన్యత వుంది. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి పవర్ ఫుల్ కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. దర్శకుడు సుధీర్ వర్మ, రవితేజను సరికొత్తగా చూపించబోతున్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ ద్వయం సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Also Read : దుమ్ములేపుతోన్న‌ ‘ఆచార్య’ ట్రైల‌ర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular