Tuesday, June 9, 2026
Homeసినిమా‘రావణాసుర’ నుంచి సుశాంత్ స్పెష‌ల్ పోస్ట‌ర్

‘రావణాసుర’ నుంచి సుశాంత్ స్పెష‌ల్ పోస్ట‌ర్

Susanth:  మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ సుధీర్ వర్మల కాంబినేష‌న్లో రూపొందుతోన్న‌ యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర`. కీల‌క‌మైన భారీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రవితేజతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న సుశాంత్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ రోజు సుశాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సుశాంత్ నీలి రంగు క‌ళ్ళ‌తో, పొడవాటి జుట్టు, గడ్డంతో తీక్ష‌ణంగా చూస్తున్నట్లు క‌నిపిస్తున్నాడు. దీనిని బ‌ట్టి ఆయ‌న పాత్ర వైవిధ్యంగా వుంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్‌ వర్క్స్‌ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ మొత్తం ఐదుగురు కథానాయికలు నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా నటిస్తున్నాడు. రచయితగా కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ చిత్రాల‌కు ప‌ని చేసిన‌ శ్రీకాంత్ విస్సా ఈ సినిమా కోసం కొత్త తరహా కథను రాశారు.  ప్రముఖ నటులు, సాంకేతిక సిబ్బంది ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular