Tuesday, June 9, 2026
Homeసినిమారవితేజ `రావణాసుర` రెండవ షెడ్యూల్ పూర్తి

రవితేజ `రావణాసుర` రెండవ షెడ్యూల్ పూర్తి

2nd Schedule completed: మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర. ఇటీవ‌లే విడుద‌ల చేసిన‌ ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సుశాంత్‌తో పాటు మరికొందరు నటీనటులు మొదటి షెడ్యూల్‌లో పాల్గొంటుండగా, రవితేజ ఇటీవ‌లే రెండో షెడ్యూల్‌లో షూట్‌లో జాయిన్ అయ్యాడు. అనతి కాలంలోనే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది.

రవితేజ, సుశాంత్, దక్ష నగార్కర్, దర్శకుడు సుధీర్ వర్మ, రచయిత శ్రీకాంత్ విస్సా, నిర్మాత అభిషేక్ నామా, సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ల నైపుణ్యం ఈ చిత్రంలో చూడవచ్చు. అభిషేక్ పిక్చర్స్ , ఆర్‌టి టీమ్‌వర్క్స్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. రవితేజ లాయర్‌గా నటిస్తుండగా, సుశాంత్ కీలక పాత్రలో రామ్‌గా కనిపించనున్నాడు. రావణాసుర చిత్రంలో మొత్తం ఐదుగురు కథానాయికలు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షనాగార్కర్, పూజిత పొన్నాడ నటించనున్నారు. సినిమాలో హీరోయిన్లందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది.

రచయితగా కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన‌ ప్రాజెక్ట్‌ లతో వ‌స్తున్న‌ శ్రీకాంత్ విస్సా ఈ సినిమా కోసం అద్భుత‌మైన‌, ఆలోచింప‌జేసేలా కథను రాశారు. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించ‌బోతున్నారు. ఇంకా ప్ర‌ముఖ న‌టీన‌టులు న‌టిస్తున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం, శ్రీకాంత్ ఎడిటర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular