Tuesday, May 14, 2024
Homeసినిమారవితేజతో అనుదీప్ 'దొంగ - పోలీస్' ఆట!

రవితేజతో అనుదీప్ ‘దొంగ – పోలీస్’ ఆట!

తెలుగు తెరపై ‘దొంగ – పోలీస్’ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ట్రీట్మెంట్ ను బట్టి కొన్ని సినిమాలు విజయాలను నమోదు చేశాయి. అదే కాన్సెప్ట్ కి కామెడీ టచ్ ఇవ్వడానికి ఇప్పుడు అనుదీప్ రెడీ అవుతున్నాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో దర్శకుడిగా .. రచయితగా అనుదీప్ మంచి పేరు తెచ్చుకున్నాడు. తన సినిమాలలో మంచి కామెడీ ఉంటుందనే ఒక నమ్మకాన్ని ఆడియన్స్ లో అనుదీప్ కలిగించాడు. తనకి మంచి పట్టున్న కామెడీతోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లే దిశగా కసరత్తు చేస్తున్నాడు.

రవితేజ హీరోగా అనుదీప్ ఈ కథను రాసుకున్నాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా హీరో పాత్రను డిజైన్ చేయడానికి కొంతసమయం తీసుకున్నాడు. అందువలన రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ముందుగా సెట్స్ పైకి వెళ్లింది. లేదంటే అనుదీప్ ప్రాజెక్టు షూటింగుకి వెళ్లేది. యాక్షన్ కామెడీ జోనర్లో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. పీపుల్ మీడియావారు భారీ బడ్జెట్ నే కేటాయించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్స్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్టుగా సమాచారం.

ఇంతకీ ఈ సినిమాలో దొంగ ఎవరు? .. పోలీస్ ఎవరు? అనే సందేహం కలగడం సహజం. హీరో దొంగ అయితే .. హీరోయిన్ పోలీస్ గా కనిపించనుందని అంటున్నారు. దొంగను పట్టుకునే ప్రయత్నంలో పోలీస్ అతనితో లవ్ లో పడుతుంది. గతంలో ఇలాంటి కంటెంట్ తో కూడిన కథలు వచ్చాయి. కానీ ఈ సారి అనుదీప్ తన మార్క్ ను చూపించనున్నడన్న మాట. భీమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడు. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ షూటింగు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టుపైకి వస్తాడని టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్