Sunday, January 19, 2025
Homeసినిమాచిరు మూవీలో ర‌వితేజ క్యారెక్ట‌ర్ ఇదేనా.?

చిరు మూవీలో ర‌వితేజ క్యారెక్ట‌ర్ ఇదేనా.?

Maas character: మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్ డైరెక్ట‌ర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ‘వాల్తేరు వీర‌య్య ‘ అనే సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.  ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే.. ఈ సినిమాలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ర‌వితేజ ప్లేస్ లో యంగ్ హీరోని తీసుకోనున్నార‌ని కూడా టాక్ వ‌చ్చింది.

తాజా వార్త ఏంటంటే.. ఆ క్యారెక్ట‌ర్ ను ర‌వితేజతోనే చేయించాలి అనుకుంటున్నార‌ట‌. ఇప్పుడు ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా క‌నిపిస్తార‌ట‌. అతని పాత్రకు హీరోయిన్ , ఓ పాప వుంటారని తెలిసింది. అతనికి చిరుకున్న సంబంధం ఏంటీ? అన్నదే ఈ చిత్ర కథ అని స‌మాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో హైలైట్ విషయం ఏంటంటే.. ఇందులో చిరు అండర్ కవర్ కాప్ గా కనిపించబోతున్నారట. బయటికి మాత్రం చేపలు పట్టే వ్యక్తిగా ఊర మాస్ గెటప్ లో గల్ల లుంగీతో కనిపించే ఈ పాత్ర పవర్ ఫుల్ గా సాగుతుందని టాక్.

ఇందులో రవితేజకు జోడీగా హీరోయిన్ కేథరిన్ నటించనుంది. ఇప్పటికే ఆమెని ఫైనల్ చేసింది చిత్ర బృందం. తను కూడా త్వరలోనే షూట్ లో పాల్గొనబోతోంది. రవితేజ ఎంట్రి ఇవ్వగానే కేథరిన్ సీన్ లని కూడా షూట్ చేయాలని దర్శకుడు బాబి ప్లాన్ చేస్తున్నారట.

Also Read : వీరయ్యకు జోడీగా శృతి హాస‌న్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్