Wednesday, March 18, 2026
Homeసినిమాకుదిరితే నాలుగు .. లేదంటే మూడు పక్కా అంటున్న రవితేజ!

కుదిరితే నాలుగు .. లేదంటే మూడు పక్కా అంటున్న రవితేజ!

Mass – Speed: మొదటి నుంచి కూడా రవితేజ కెరియర్ పరంగా చాలా స్పీడ్ చూపిస్తూ వస్తున్నాడు. రవితేజ ఎంతమాత్రం టైమ్ వేస్టు చేయడు. తన సినిమాలకు సంబంధించిన కథలను వినడం .. ముందుగా అనుకున్న ప్రకారం వాటిని పూర్తి చేయడం. ఎంతసేపు ఆయన అందుకు సంబంధించిన పనులతోనే బిజీగా ఉంటాడు. అందువల్లనే ఆయన చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చాడు. ప్రతి ఏడాది తన నుంచి మూడు సినిమాలు థియేటర్లకు వెళ్లవలసిందే అనే కాన్సెప్ట్ తో ఆయన కనిపిస్తాడు. కరోనా ముందు వరకూ ఆయన ఆ పద్ధతిని చాలావరకూ ఫాలో అవుతూ వచ్చాడు.

ఈ ఏడాది కూడా ఆయన నుంచి మూడు సినిమాలు రావడమనేది ఖాయమైపోయింది. ‘రమేశ్ వర్మ దర్శకత్వంలో ఆయన చేసిన  ‘ఖిలాడి‘ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు. ఇక ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను మార్చి 25వ తేదీన గానీ .. ఏప్రిల్ 15 వ తేదీన గాని రిలీజ్ చేయనున్నారు. శరత్ మండవ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సామ్ సీఎస్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి.

ఇక సుధీర్ వర్మ దర్శకత్వంలో పట్టాలెక్కిన ‘రావణాసుర’ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన థియేటర్లకు రానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోంది. ఈ మూడు సినిమాలు థియేటర్లకు రావడం పక్కా. అయితే నాలుగో సినిమాగా ‘ధమాకా’ డిసెంబర్లో పలకరించే అవకాశం లేకపోలేదు. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆల్రెడీ సెట్స్ పైనే ఉంది. శ్రీలీల ఈ సినిమాలో రవితేజ జోడీగా అలరించనుంది. కరోనా ఎంత కాలు అడ్డుపెట్టినా రవితేజ దూకుడును మాత్రం ఆపలేకపోయిందనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular