Saturday, January 18, 2025
Homeసినిమాజులైలో వస్తానంటున్న ‘ఖిలాడి’

జులైలో వస్తానంటున్న ‘ఖిలాడి’

మాస్ మహా రాజా రవితేజ క్రాక్ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. మలినేని గోపీచంద్ తెరకెక్కించిన క్రాక్ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సాధించడంతో రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. రవితేజ తదుపరి చిత్రం ఖిలాడి. క్రాక్ సక్సస్ తో ఖిలాడి మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి రాక్షసుడు మూవీతో విజయం సాధించిన రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీలో రవితేజ సరసన డింపుల్ హయాతి – మీనాక్షిచౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇంట్రస్టింగ్ గా ఉండడం.. టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఖిలాడి కూడా రవితేజకు ఖచ్చితంగా విజయాన్ని అందిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. రవితేజని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో అలా.. ఆడియన్స్ కి నచ్చేలా ఈ సినిమాని దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తుండడం ఈ సినిమాకి ప్రత్యేకార్షణ అని చెప్పచ్చు.

అయితే… ఈ మూవీని మే 28న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడం.. మే నెలలో సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడిందని తెలిసింది. మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ.. జులైలో ఖిలాడి మూవీని విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలిసింది. మరి.. క్రాక్ మూవీతో ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఖిలాడి మూవీతో కూడా ఆకట్టుకుని మరో సక్సస్ సాధిస్తాడని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్