Sunday, June 7, 2026
Homeసినిమాఫిబ్రవరి 11న వస్తున్న రవితేజ ‘ఖిలాడి’

ఫిబ్రవరి 11న వస్తున్న రవితేజ ‘ఖిలాడి’

Ravi Teja Khiladi Released Date Announced :

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేష‌న్లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఖిలాడి సినిమా విడుదల తేదీని గురువారం చిత్రనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్‌లో సిగరెట్ తాగుతూ మాస్ లుక్కులో రవితేజ కనిపించారు.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌ ను వేగవంతం చేశారు చిత్ర యూనిట్. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రొడక్షన్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియెస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ డిఫరెంట్ రోల్‌ను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ALSO READ : ‘ఖిలాడి’ తో కిక్ ఇస్తోన్న రవి తేజ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular