Tuesday, April 16, 2024
Homeసినిమా'వాల్తేరు వీరయ్య'లో రవితేజ నిడివి ఎంత?

‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ నిడివి ఎంత?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య‘, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే… మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రవితేజ నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఇందులో ఆయన క్యారెక్టర్ ఏంటి..?  ఎంత సేపు కనిపిస్తారు..? అనేది ఆసక్తిగా మారింది. తాజా వార్త ఏంటంటే… రవితేజ క్యారెక్టర్ 40 నిమిషాల వరకు ఉంటుందట.

రవితేజ కనిపించినంత సేపు.. సినిమా ఓ రేంజ్ లో ఉంటుందట. ముఖ్యంగా చిరంజీవి, రవితేజ క్యారెక్టర్స్ పై వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయట. అలాగే భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉంటుందట. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే సాంగ్స్ రెడీ చేశారు. మొత్తానికి వాల్తేరు వీరయ్య చిత్రాన్ని అందరికీ నచ్చేలా రెడీ చేస్తున్నారు. మరి… ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్