Friday, March 6, 2026
Homeసినిమాహీరో రవితేజకు తీవ్ర గాయాలు: ఆరు వారాల విశ్రాంతి

హీరో రవితేజకు తీవ్ర గాయాలు: ఆరు వారాల విశ్రాంతి

హీరో రవితేజ ఓ షూటింగ్ లో తీవ్ర గాయాలపాలయ్యారు.  భాను దర్శకత్వంలో హైదరాబాద్ శివారులోని  అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఓ పోరాట దృశ్యం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లో రవితేజ కుడిచేతికి తీవ్ర గాయమైంది. కుడిచేతి నరాలు చిట్లడంతో యశోద హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యుల సూచించినట్లు తెలుస్తోంది.

నోటినిండా ఆక్సిజన్ ట్యూబులు, గుండెల మీద ఈసీజీ వైర్లు, కుడిచేతికి రక్తంతో ఆసుపత్రి బెడ్ మీద రవితేజ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటో చూసిన ఆయన అభిమానులు తీవ్ర  ఆందోళనకు గురవుతున్తునారు.  రవితేజకు ఎలాంటి ఇబ్బంది లేదని కేవలం శస్త్ర చికిత్స మాత్రమే జరిగిందని ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఇటీవలే విడుదలై నిరాశపరిచింది. ఆయన నటిస్తోన్న 75వ చిత్రంగా… #RT75 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న తాజా సినిమా షూటింగ్ లో రవితేజ పాల్గొంటున్నారు. ‘సామజవరగమన’ రచయిత  భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular