Thursday, March 19, 2026
Homeసినిమా'ధమాకా' రూ.101 కోట్ల  మాసివ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్

‘ధమాకా’ రూ.101 కోట్ల  మాసివ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌ టైనర్ ”ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాల పై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధమాకా’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ధమాకా 101 CR మాసివ్ సెలబ్రేషన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో మేకర్స్, మీడియా ప్రతినిధుల చేతుల మీదగా చిత్ర యూనిట్ కు మెమెంటోలను ప్రదానం కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.

అనంతరం మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. చాలా అనందంగా వుంది. దర్శకుడు  త్రినాథరావు, రచయిత ప్రసన్నకి  అభినందనలు. శ్రీలీలకి కంగ్రాట్స్. ఇలాంటి కంగ్రాట్స్ ఇంకా వింటూనే వుండాలి. భీమ్స్ ఇలాగనే ఇరగదీసేయాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిభొట్ల గారికి బిగ్  కంగ్రాట్స్. ఎక్కడా రాజీపడకుండా చేశారు. చాలా పాజిటివ్ గా వుంటారు. వారు నెక్స్ట్ లెవల్ వెళ్తున్నారు. మీడియాతో మెమెంటోలు ఇవ్వడం చాలా బావుంది. మీడియాకి కృతజ్ఞతలు. వంశీ శేఖర్ కి  థాంక్స్. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular