Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్AUS Vs. RSA: చివరి టెస్ట్ డ్రా

AUS Vs. RSA: చివరి టెస్ట్ డ్రా

ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో ఒక రోజు ఆట పూర్తిగా రద్దు కాగా మరో మూడురోజులపాటు ఆటను పూర్తిగా కొనసాగించలేక పోయారు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 475 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా­-195 (నాటౌట్); స్టీవెన్ స్మిత్-104; ట్రావిస్ హెడ్ -70 పరుగులతో సత్తా చాటారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కేశవ్ మహారాజ్-53; హార్మర్-47; జోండో-36; బావుమా-35 పరుగులు చేశారు.

ఆసీస్ బౌలర్లలో హాజెల్ వుడ్ 4; కమ్మిన్స 3; లియాన్ 2; ట్రావిస్ హెడ్ 1 వికెట్ పడగొట్టారు.

ఫాలో ఆన్ ఆడిన ప్రోటీస్ జట్టు 2 వికెట్లకు 106 పరుగులు చేసింది. దీనితో ఐదురోజుల ఆటకు తెరపడి మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మూడు టెస్టుల సిరీస్ 2-0తో ఆసీస్ గెల్చుకుంది.

ఉస్మాన్ ఖవాజా కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, డేవిడ్ వార్నర్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్