Saturday, November 23, 2024
HomeTrending Newsరాయదుర్గం - టోలిచౌకి ఫ్లై ఓవర్ ప్రారంభం

రాయదుర్గం – టోలిచౌకి ఫ్లై ఓవర్ ప్రారంభం

రిజినల్ రింగ్ రోడ్ పూర్తి అయితే దేశంలో హైదరాబాద్ నగరానికి మరే నగరం సాటి రాదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఆరున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, దాని ఫలితాలు ఈ రోజు హైదరాబాద్ లొ కనిపిస్తున్నాయని మంత్రి తెలిపారు. రూ.333 కోట్లతో చేపట్టిన రాయదుర్గం – టోలిచౌకి మధ్య 2.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన షేక్ పెట్ ఫ్లై ఓవర్ ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని,  నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి అయ్యి అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికలో భౌగోళికంగా తెలంగాణ దేశంలో 11వ పెద్ద రాష్ట్రమని, జనాభా పరంగా 12 వ పెద్ద రాష్ట్రమని, ఆర్థీక అభివృద్దిలో నాలుగో పెద్ద రాష్ట్రమని ప్రకటించిందని కేటిఆర్ చెప్పారు. ఇతర పెద్ద రాష్ట్రాల కన్నా తెలంగాణ దుసుకుపోఎందుకు సిఎం కెసిఆర్ దూర దృష్టి కారణం అనటంలో అతిశయోక్తి లేదన్నారు.
రసుల్పుర చొరస్తాలో జంక్షన్ విస్తరించేందుకు మిలిటరీ భూములు ఇచ్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహకరించాలని కోరారు. ఏ.ఓ.సి పరిధిలోని 21 రోడ్ల వెడల్పుకు కేంద్ర రక్షణ శాఖ ఒప్పించేందుకు కిషన్ రెడ్డి కలిసి రావాలని, ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం లేఖలు రాసిందని మంత్రి కేటిఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్ ప్యారడైజ్ నుంచి కొంపల్లి, ప్యాట్నీ నుంచి తుర్కపల్లి వరకు స్కై వే నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ కు ఆరేళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్నో, కాన్పూర్ నగరాల్లో రక్షణ శాఖ భూములు ఇస్తుంటే హైదరాబాద్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు  తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపుడి గాంధీ, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మరియు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్