Saturday, November 23, 2024
HomeTrending NewsYS Jagan: ఆర్బీకేల ద్వారా గ్రామ స్వరాజ్యం : సిఎం

YS Jagan: ఆర్బీకేల ద్వారా గ్రామ స్వరాజ్యం : సిఎం

ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు. వ్యవసాయ పరికరాలు కూడా అందుబాటులోకి తీసుకు వస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. గుంటూరు చుట్టుగుంట సర్కిల్ లో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు,  వ్యవసాయ యంత్ర పరికరాలు, పనిముట్ల పంపిణీ రెండో మెగా మేళాను జెండా ఊపి సిఎం జగన్ ప్రారంభించారు.

రైతన్నలు ఒక సంఘంగా ఏర్పడి  ఆర్బీకే పరిధిలో ఉన్నమిగిలిన రైతులకు కూడా యంత్రాలన్నీ అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని… 10,444 ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ పరిధిలో, ఆర్బీకేలతో అనుసంధానమై, ఆర్బీకే పరిధిలోని రైతన్నలే ఈ వ్యవసాయ పనిముట్లన్నీ అతి తక్కువ ధరకు మిగిలిన రైతులకు అందుబాటులోకి తీసుకొస్తారని వివరించారు.  ఆర్బీకే  ద్వారా వ్యవసాయ రంగంలో తాము చేపడుతోన్న కార్యక్రమాలు  గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెబుతున్నాయని వ్యాఖ్యానించారు.

ఇంతకు ముందు మనం 6,525 ఆర్బీకే స్థాయిలో, 391 క్లస్టర్ స్థాయిలోనూ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు రైతుల పేరుతో ప్రారంభించామని, వీటి ద్వారా 3,800 ట్రాక్టర్లను, 391 కంబైన్ హార్వెస్టర్లను, 22,580 ఇతర యంత్రాలను సరఫరా చేశామని  తెలిపారు. నేడు మరో 3,919 ఆర్బీకే స్థాయిలో,  వంద క్లస్టర్లలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లతో పాటు 13,573 ఇతర యంత్రాలను అందుబాటులోకో తెస్తున్నామని వివరించారు.

ప్రతి ఆర్బీకేకు రూ. 15 లక్షలు కేటాయించి  రైతులు నిర్ణయించిన యంత్రాలు కొనుగోలు చేశామని, వారి బాగా పండుతోన్న 491 క్లస్టర్ స్థాయిలో కంబైన్ హార్వెస్టర్ తీసుకువచ్చామని చెప్పారు. ఒక్కో  క్లస్టర్ లో హార్వెస్టర్‌ను 25 లక్షల రూపాయలతో అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.   మొత్తంగా 1,052 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.

అక్టోబర్ లో 7 లక్షల మంది రైతన్నలకు  మేలు చేసేలా వ్యవసాయ పనిముట్లను, స్ప్రేయర్లు, టార్పాలిన్లు లాంటి వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. అర్బీకే వ్యవస్థను పటిష్ట పరుస్తూ రైతన్నలకు ఇంకా మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నామని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్