Friday, October 18, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: ముంబై నాలుగో ఓటమి-బెంగుళూరు విన్

ఐపీఎల్: ముంబై నాలుగో ఓటమి-బెంగుళూరు విన్

IPL-2022: ఐపీఎల్ ఈ సీజన్ ముంబై ఇండియన్స్ కు అస్సలు కలిసిరావడం లేదు. వరుస ఓటములు ఆ జట్టును వెంటాడుతున్నాయి. నేడు జరిగిన మ్యాచ్ లో ముంబై పై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ బ్యాట్ తో సత్తా చాటారు.

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఏ)స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బెంగుళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై తొలి వికెట్ కు (కెప్టెన్ రోహిత్ శర్మ26) 50 పరుగులు చేసింది. వన్డౌన్ లో వచ్చిన డేవిడ్ బ్రేవిస్ కేవలం 8 పరుగులే చేయగా, ఇషాన్ కిషన్ 26 పరుగులు చేసి ఔటయ్యాడు. తిలక్ వర్మ, పోలార్డ్ డకౌట్ గా వెనుదిరిగారు. రమణ్ దీప్ సింగ్ కూడా కేవలం 6 పరుగులే చేసి వెనుదిరిగాడు. 79 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్ కలిసి ఏడో వికెట్ కు అజేయమైన 72 పరుగులు జోడించారు. సూర్య 37 బంతుల్లో 5 ఫోర్లు, 6సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. బెంగుళూరు బౌలర్లలో హసరంగ, హర్షల్ పటేల్ చెరో రెండు; ఆకాష్ దీప్ ఒక వికెట్ పడగొట్టారు.

తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన బెంగుళూరు తొలి వికెట్ కు 50 పరుగులు చేసింది, కెప్టెన్ డూప్లెసిస్ 24 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తో 16 పరుగులు చేసి ఉనాద్కత్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ అనూజ్ రావత్ ధాటిగా ఆడాడు. రెండో వికెట్ కు రావత్- కోహ్లీ 80 పరుగులు జోడించారు. 47 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసిన రావత్ రనౌట్ గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే 38 బంతుల్లో ఐదు ఫోర్లతో 48 పరుగులు చేసిన కోహ్లీ కూడా డేవిడ్ బ్రేవిస్ బౌలింగ్ లో ఎల్బీగా ఔటయ్యాడు.

చివరి రెండు ఓవర్లలో 8 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతికి కోహ్లీ ఔటయ్యాడు, తర్వాతి రెండు బంతులను వరుసగా బౌండరీలు కొట్టిన మాక్స్ వెల్ మరో పది బంతులు మిగిలి ఉండగానే విజయం అందించాడు.

అనూజ్ రావత్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

Also Read : ఐపీఎల్: హైదరాబాద్ కు తొలి విజయం  

RELATED ARTICLES

Most Popular

న్యూస్