Thursday, April 18, 2024
HomeసినిమాNTR: మే 20న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే

NTR: మే 20న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే

మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఆయన అభిమానులకు పండగ రోజు. ప్రతి ఏటా ఈ రోజున తన సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఇస్తుంటారు. ఈసారి ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ్‌ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కు జంటగా నటిస్తుంది. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇక పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే టీజర్ కట్ చేశారని, ఇది సినిమాపై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేసేలా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ కు సంబంధించి మేకర్స్ అఫిషియల్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఎన్టీఆర్ 30 గురించే కాకుండా వార్ 2 నుంచి కూడా అప్ డేట్ రానుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు వార్ 2 పై అధికారిక సమాచారం లేదు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దీనిపై అనౌన్స్ మెంట్ రానుందని తెలిసింది. ఈ పుట్టినరోజుకు అభిమానులు సింహాద్రి సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. మొత్తానికి ఈ పుట్టినరోజు యంగ్ టైగర్ అభిమానులకు చాలా స్పెషల్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్