Sunday, January 19, 2025
HomeTrending Newsఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ : మంత్రి హ‌రీశ్‌రావు

ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ : మంత్రి హ‌రీశ్‌రావు

రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు శుభ‌వార్త వినిపించారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల స‌ర్వీసుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సెర్ఫ్ ఉద్యోగుల‌కు పే స్కేల్ స‌వ‌ర‌ణ చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రిగా నాల్గవ సారి తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా ఆర్థిక, వైద్య – ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వివిధ అంశాల్ని ప్రస్తావించారు.

కేంద్ర ప్ర‌భుత్వం నిధుల‌లో కోత‌లు పెడుతూ, అనేక ఆర్థిక ఆంక్ష‌లు పెడుతున్న‌ప్ప‌టికీ, రాష్ట్రంలో సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల కోసం పెద్ద ఎత్తున ఆర్థిక అవ‌స‌రాలు ఉన్న‌ప్ప‌టికీ, తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగ‌, ఉపాధ్యాయుల ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఏనాడు త‌క్కువ చేయ‌లేద‌న్నారు.

ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞ‌ప్తుల మేర‌కు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని తీసుకురాబోతున్నామ‌ని హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్ర‌స్ట్‌ను ఏర్పాటు చేసి ఇందులో ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ‌, రిటైర్డ్ ఉద్యోగుల ప్ర‌తినిధుల‌ను భాగ‌స్వాములుగా చేస్తామ‌న్నారు. దీనికి సంబంధించిన విధివిధానాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని హ‌రీశ్ రావు ప్ర‌క‌టించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్