కిరణ్‌ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీ రూపొందింది. బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.

తిరుమల తిరుపతి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు జంటగా క‌శ్మీర ప‌ర్ధేశీ నటించింది.. ఇది వరకే ఈ చిత్రం నుండి రిలీజైన వాసవసుహాస.., బంగారం పాటలకు, అలానే ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ తరుణంలో ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనుంది చిత్రబృందం. ఈ సినిమా ట్రైలర్ ను రేపు సాయంత్రం (ఫిబ్రవరి 7న) 5:04 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. సాయి ధరమ్ తేజ్ ఈ ఈవెంట్ కి హాజరు కానున్నారు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన కిరణ్‌ అబ్బవరం ఈ మూవీతో సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *