Saturday, March 14, 2026
Homeసినిమా'రిపబ్లిక్' స‌రికొత్త రికార్డ్

‘రిపబ్లిక్’ స‌రికొత్త రికార్డ్

Republic – Movement:
సుప్రీమ్ హీరో సాయి తేజ్, విలక్షణ దర్శకుడు దేవ్ కట్టా కలయికలో రూపొందిన సినిమా ‘రిపబ్లిక్‘. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమిటి ? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి ? ప్రజలు ఏం చేయాలి ? ఏం తెలుసుకోవాలి ? వంటివి చెబుతూ… సామాజిక బాధ్యతతో రూపొందిన చిత్రమిది. దీనికి థియేటర్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో కరోనా భయాలతో వెళ్లని ప్రేక్షకులు, ‘జీ 5’ ఓటీటీ వేదికలో విడుదలైన తర్వాత సినిమాను ఓ ఉద్యమంలా చూశారు. ‘రిపబ్లిక్’ ఓ సినిమా కాదని, ఉద్యమం (‘రిపబ్లిక్’ మూవీ కాదు, మూమెంట్) అని అంటున్నారు.

నవంబర్ 26న ‘జీ 5’ ఓటీటీ వేదికలో ‘రిపబ్లిక్’ సినిమా విడుదలైంది. ఆ రోజు నుంచి సోషల్ మీడియాలో సినిమా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేసిన ‘జీ 5’ బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు. మన దేశంలో తొలిసారి డైరెక్టర్ కామెంటరీతో విడుదలైన సినిమా కూడా ఇదే. ‘జీ 5’లో విడుదలైన ఏడు రోజుల్లో సినిమాను 12 కోట్ల నిమిషాల పాటు వీక్షకులు చూశారు. ఇదొక రికార్డు. సాయి తేజ్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అయ్యింది. సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా కూడా ‘జీ 5’ ఓటీటీలో విడుదలైంది.

Also Read : బాలయ్య గారిలో ఓ పవర్ ఉంది : ఫైట్ మాస్ట‌ర్ శివ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular