Saturday, June 6, 2026
HomeTrending Newsవైసీపీలో చేరిన ఎండి ఇంతియాజ్

వైసీపీలో చేరిన ఎండి ఇంతియాజ్

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏ.ఎండి. ఇంతియాజ్‌ స్వచ్చంద పదవీ విరమణ చేసిన అనంతరం నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఇంతియాజ్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.  సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా  ఇంతియాజ్‌ బాధ్యతలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, కర్నూలు మేయర్‌ బి.వై.రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular