ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, కార్పోరేట్ తరహాలో ప్రభుత్వ హాస్పిటల్స్ పనిచేస్తాయని గొప్పలు చెప్పారని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైద్రాబాద్ కు కూత వేటు దూరంలో ఈ ఘటన జరిగిందని, అయినా ఇన్నిరోజులు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని, అపోలో లో చాలా మందికి ఇసియు లో చికిత్స అందుతోందని చెప్పారు. హాస్పిటల్ లో పేషంట్స్ పర్యవేక్షణ కోసం ఒక్క వైద్య శాఖ అధికారులు లేరని, ఇక్కడికి తెచ్చి జాయిన్ చేసి వదిలేశారని మండిపడ్డారు. ఆపరేషన్ చేసుకున్న వారు ఇప్పట్లో పని చేసుకోలేని పరిస్థితి ఉందని, ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. కేసీఆర్ బీహార్ పర్యటన చేయడం కాదు .. ఇక్కడ చనిపోతున్న వారిని పట్టించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే వరకు వారికి అండగా కాంగ్రెస్ పోరాడుతుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read : కు.ని వికటించి మరో ఇద్దరు మహిళల మృతి