Thursday, March 19, 2026
HomeTrending Newsఅస్సాం సిఎం మీద కేసు పెడతాం

అస్సాం సిఎం మీద కేసు పెడతాం

అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు దేశంలో వుండే మాతృమూర్తులందరిని అవమానించే విధంగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు, ప్రధాని మోడీ,నడ్డా,రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించకపోవడం దారుణమన్నారు. సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తమని చెప్పుకునే ప్రధాని మోడీ అస్సాం ముఖ్యమంత్రి ని బర్త్ రఫ్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

సోమవారం తెలంగాణ లోని709 పొలీస్ స్టేషన్ లలో అస్సాం ముఖ్యమంత్రి పై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అస్సాం సీఎం పై నేనె స్వయంగా ఫిర్యాదు చేస్తానని రేవంత్ చెప్పారు. అస్సాం సిఎం అసహ్యంగా, జుగుప్సాకరంగా దేశ సంస్కృతికి మచ్చ తెచ్చేలా దిగజారి మాట్లాడాడని, ఒక్క రాహుల్ గాంధీ కుటుంబానికి కాదు 140 కోట్ల భారతీయులకు, మాతృమూర్తులకు జరిగిన అవమానమన్నారు.

కేంద్రం అవినీతి పై కేసీఆర్ దగ్గర సమాచారం ఉంటె ఎందుకు బయటపెట్టడం లేదని, బీజేపీ,టీఆరెస్ రెండు తోడు దొంగలే అని రేవంత్ ఆరోపించారు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు దోచుకుంటున్నారు. ఆయన జాతకం ఈయన దగ్గర ఉంది అంటున్నారు. మరి ఎందుకు భయటపెట్టడం లేదని, కేసీఆర్ అవినీతి చిట్టా మా దగ్గర ఉందని అంటున్నారు బిజెపి వాళ్ళు . మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ప్రశ్నించారు.

అవినీతి సమాచారం ఉంటే దాయడం కూడా నేరమే అన్న రేవంత్ కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ భరించదన్నారు. కేసీఆర్ ఒక నమ్మక ద్రోహి అని ఇప్పటికే 2సార్లు కేసీఆర్ ను నమ్మి మోసపోయామని రేవంత్ అన్నారు. గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ ని నమ్మమని, టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నిటికీ కలవదు, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదన్నారు. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తాం… ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని రేవంత్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular