Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్ఆస్ట్రేలియా ‘సూపర్’ విజయం

ఆస్ట్రేలియా ‘సూపర్’ విజయం

Super Over win: ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన రెండో టి 20మ్యాచ్ లో ఆతిథ్య ఆసీస్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఆసీస్ బౌలర్ హాజెల్ వుడ్ రాణించడంతో సూపర్ ఓవర్లో శ్రీలంక ఒక వికెట్ నష్టానికి ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ మూడు బంతుల్లోనే ఒక సింగల్, రెండు ఫోర్లతో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జోష్ యింగ్లిష్ -48, కెప్టెన్ ఆరోన్ పించ్-25 మినహా మిగిలిన వారు అంతంత మాత్రంగానే రాణించారు. నిర్ణీత20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. లంక బౌలర్లలో చమీర, హసరంగా చెరో రెండు వికెట్లు; తుషార, తీక్షణ చెరో వికెట్ పడగొట్టారు.

శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిషాంక 53 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. ఓ వైపు సహచర బ్యాట్స్ మెన్ ఒక్కొక్కరుగా అవుట్ అవుతున్నా నిషాంక చెలరేగి ఆడాడు. ఆ తర్వాత దాసున శనక 19 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. హసరంగా 13 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో 19 పరుగులు కావాల్సి ఉండగా లంక ఆటగాళ్ళు రెండు ఫోర్లు, ఒక సికర్స్, రెండు అదనపు పరుగులతో కలిపి మొత్తం 18 పరుగులు రావడంతో మ్యాచ్ టై అయ్యింది. శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. హాజెల్ వుడ్ మూడు వికెట్లు; కమ్మిన్స్,  స్టోనిష్, కేన్ రిచర్డ్స్ సన్, ఆడమ్ జంపా తలా ఒక వికెట్ పడగొట్టారు.

జోష్ హాజెల్ వుడ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

ఐదు టి20 ల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంతో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్