Tuesday, March 25, 2025
HomeTrending Newsడికే తో రేవంత్ భేటి

డికే తో రేవంత్ భేటి

తెలంగాణా పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఏ. రేవంత్ రెడ్డి బెంగుళూరు లో క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ  అధ్య‌క్షులు డి.కే. శివ‌కుమార్ ను కలుసుకున్నారు. జూలై 7న జ‌రిగే  టీపీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి  రావాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

శివ కుమార్ ను కలిసేందుకు ఈ ఉదయం ప్రత్యేకంగా బెంగుళూరు వెళ్లారు రేవంత్ రెడ్డి. నేటి సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న రేవంత్, రేపు పిసిసి ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్కలను కలుసుకోనున్నారు. రేవంత్ కు పదవి ఇవ్వడాన్నిభట్టి వ్యతిరేకించారని వార్తలు వినిపించిన నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం భట్టిని ఢిల్లీ కి పిలిపించి మాట్లాడింది.  తనకు పిసిసి అధ్యక్ష పదవి ప్రకటించిన నుంచీ రేవంత్ పార్టీలోని సీనియర్ నేతలను వారి ఇళ్ళకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్యను రేవంత్ కలుసుకున్నారు, నిన్న రోశయ్య పుట్టిన రోజు కూడా కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్