Friday, March 20, 2026
HomeTrending Newsక్వింటాల్ కు రూ.1960 కనీస మద్దతు ధర

క్వింటాల్ కు రూ.1960 కనీస మద్దతు ధర

రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పౌర సరఫరాల శాఖ కమీషనర్ అనీల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి లు కూడా పాల్గొన్నారు.

ప్రతీ జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలని సీస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లోను ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిపి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా అధికారులు వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలన్నారు.

గత యాసంగిలో ఏర్పాటు చేసినన్ని కేంద్రాలు.. అంతకన్నా ఎక్కువైనా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలను కల్పించాలని, ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించి కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గన్ని బ్యాగుల సేకరణకై ప్రత్యేక దృష్టిని సాధించాలి. దీనికై ప్రత్యేక అధికారిని నియమించి తగు పర్యవేక్షణ చేయాలన్నారు. క్వింటాల్ కు రూ.1960 కనీస మద్దతు ధరగా నిర్ణయించడం జరిగింది. వ్యవసాయవిస్తరణ అధికారుల సేవలను ధాన్యం కొనుగోలులో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేసేందుకు తగు వాహనాల ఏర్పాట్లను చేసుకోవాలని చెప్పారు. ప్రతీ రోజు ధాన్యం సేకరణ వివరాల నివేదికలు సమర్పించాలి. జిల్లాలో వరి కోతల వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద ఉన్నాయి. వీటి ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని, పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలి. దీనికై పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

Also Read :  తెలంగాణ రైతులకు శుభవార్త

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular