Sunday, January 19, 2025
Homeసినిమాచరణ్‌ పై వర్మ సంచలన వ్యాఖ్యలు

చరణ్‌ పై వర్మ సంచలన వ్యాఖ్యలు

RGV -another: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నార్త్ లో మాంచి క్రేజ్ సంపాదించు కున్నారు. ఒకప్పుడు ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ క్రేజ్ కు తగ్గట్టుగానే పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు చరణ్‌.

ఇదిలా ఉంటే… రామ్ చరణ్ ఎన్‌డిటివి ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అవార్డును గెల్చుకున్న  సంగతి తెలిసిందే.  అసలు విషయానికి వస్తే.. ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉండే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రామ్ చరణ్ గురించి కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. ఇంతకీ వర్మ ఏమని కామెంట్ చేశారంటే…చరణ్ జెంటిల్‌మెన్‌గా చాలా పర్ఫెక్ట్ అని ఆర్జీవీ అన్నారు.

చరణ్ వివాదాస్పద వ్యక్తి కాదు అని, ఇలా ఉండటం ద్వారా బోరింగ్ వ్యక్తి అని వర్మ తెలిపారు. అయితే, స్టార్‌గా, అతను పాత్రను, సినిమాను సంప్రదించే విధానం అద్భుతం అని అన్నారు. తన తదుపరి చిత్రం డేంజరస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్జీవీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో మరో భారీ పాన్ ఇండియా మూవీలో నటించనున్నాడు. మరి.. ఈ రెండు చిత్రాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్