Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ICC WC Qualifiers: ఎమిరేట్స్ పై స్కాట్లాండ్ ఘన విజయం

ICC WC Qualifiers: ఎమిరేట్స్ పై స్కాట్లాండ్ ఘన విజయం

ఐసిసి వరల్డ్ కప్-2023 క్వాలిఫైర్స్ టోర్నీలో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై  స్కాట్లాండ్ 111 పరుగులతో ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ 127 పరుగులతో సత్తా చాటాడు.

బులావాయో అథ్లెటిక్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఎమిరేట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. రిచీ బెర్రింగ్టన్ 127 తో పాటు మార్క్ వాట్-44; మైఖేల్ లీస్క్-41 పరుగులు చేశారు. ఎమిరేట్స్ బౌలర్లలో జునైద్ సిద్దిఖి 3;  అలీ నాసర్ 2;  జహూర్ ఖాన్, మేయప్పన్ చెరో వికెట్ సాధించారు.

ఎమిరేట్స్ 21 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. జట్టులో కెప్టెన్, ఓపెనర్ ముహమ్మద్ వసీమ్-36; బాసిల్ హమీద్-30; అయాన్ అఫ్జల్ ఖాన్-21; కార్తీక్ మేయప్పన్-23  పరుగులు చేశారు. 35.3  ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్ 4; క్రిస్ సోల్ 3; బ్రాండెన్ మెక్ ముల్లెన్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా ఒక వికెట్ సాధించారు.

సెంచరీ సాధించింన స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్